Mrunal Thakur : తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్..

తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్. వైరల్ అవుతున్న వీడియో.

Mrunal Thakur : తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur shows her respect to telugu audience at Family Star pre release event

Mrunal Thakur : బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మృణాల్.. ఇక్కడి వారి గుండెల్లో సీతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత హాయ్ నాన్న సినిమాలో యష్ణగా మరోసారి తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్నారు.

ఇప్పుడు మరోసారి తెలుగు కుర్రాళ్ళ గుండె కొల్లగొట్టడానికి ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఇందుగా రాబోతున్నారు. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకు కారణం తెలుగు ఆడియన్స్ తన పై చూపుతున్న ప్రేమ. నేడు ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి మృణాల్ తన ఫ్యామిలీని కూడా తీసుకు వచ్చారు. తనకి ఇక్కడ ఉన్న అభిమానాన్ని చూపించారు.

Also read : Chiranjeevi : చిరంజీవి నిద్ర లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..?

ఇక తన పై ఇంతటి అభిమానం చూపుతున్న తెలుగు అభిమానులకు కృతజ్ఞతగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను అంటూ.. స్టేజి పై నుంచి తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసారు. మృణాల్ చేసిన ఈ పని తెలుగు ఫ్యాన్స్ మరింత ఫిదా అయ్యిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమాలో మృణాల్ ఇందు అనే పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కూడా తన మునపటి పాత్రలులా అభిమానుల గుండెలను దోచుకుంటుందని చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరి సీతారామం, హాయ్ నాన్నతో వరుస సక్సెస్ లో ఉన్న మృణాల్.. ఈ సినిమాతో కూడా సక్సెస్ ని అందుకొని హ్యాట్రిక్ ని సొంతం చేసుకుంటారేమో చూడాలి.