Bangarraju: ముహూర్తం ఫిక్స్.. నాగ్ మొదలు పెట్టేస్తున్నాడు..

రీసెంట్ గా వైల్డ్ డాగ్ తో సక్సెస్ కొట్టిన నాగ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. నాగ్ ఐదేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమా..

Bangarraju: ముహూర్తం ఫిక్స్.. నాగ్ మొదలు పెట్టేస్తున్నాడు..

Bangarraju

Updated On : August 18, 2021 / 8:48 PM IST

Bangarraju: రీసెంట్ గా వైల్డ్ డాగ్ తో సక్సెస్ కొట్టిన నాగ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. నాగ్ ఐదేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. నాగ్ డబుల్ రోల్ లో రొమాంటిక్ యాంగిల్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఆ సినిమా విడుదలైన సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రకటించాడు.

అయితే, సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ సిద్ధం అవుతుందని అందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టి బంగార్రాజు పేరును కూడా ప్రకటించారు. ఎన్నో కారణాలతో అప్పుడు అక్కడ నుండి అడుగు ముందుకు పడలేదు. కానీ, ఇప్పుడు బంగార్రాజుకు ముహూర్తం పెట్టేశారు. బంగార్రాజు సినిమాను ఆగ‌స్టు 20న గ్రాండ్ గా లాంఛ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో నాగచైత‌న్య కీల‌క పాత్ర‌లో నటిస్తుండగా.. చైతూకి జోడిగా కృతిశెట్టి నటిస్తుంది. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ సరసన నటించిన రమ్యకృష్ణనే బంగార్రాజులో కూడా నటించనుండగా కాజల్ అగర్వాల్ మరో ముఖ్య పాత్రలో నటించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని రెండు స్టూడియోలలో ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ పనులు మొదలు కాగా.. ‘సోగ్గాడే’లో బంగార్రాజు మరణానికి ముందు ఏం జరిగిందో ఈ సినిమాలో చూపించనున్నారట.