Shilpa Shetty : శిల్పా శెట్టి అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

శిల్పా శెట్టి, వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..

Shilpa Shetty : శిల్పా శెట్టి అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

Mumbai Police

Updated On : July 24, 2021 / 12:17 PM IST

Shilpa Shetty: రాజ్ కుంద్రా.. శిల్పా శెట్టి భర్తగా కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. బిజినెస్‌మెన్ ముసుగులో రాజ్ కుంద్రా బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపితమవడంతో రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు.

Raj Kundra : భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి.. రిమాండ్ పొడిగించిన పోలీసులు..

రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న పలువురు సెలబ్రిటీలను పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు తెలియడంతో, మరింత కీలక సమాచారం రాబట్టడానికి మరో నాలుగు రోజులపాటు రాజ్ కుంద్రాకు కస్టడీ పొడిగించారు. ఇప్పుడు శిల్పా శెట్టిని ప్రశ్నించడానికి రెడీ అయ్యారు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.

Shilpa Shetty : భర్త వ్యవహారంతో శిల్పా శెట్టికి సెగ?

ఇప్పటికే ఆమె ఇంటికి చేరుకున్నట్టు, పోలీసుల వెంట రాజ్ కుంద్రా కూడా ఉన్నట్లు సమాచారం. శిల్పా శెట్టి, వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శిల్పా శెట్టిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.