Ajay Arasada : పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్..
త్వరలోనే పవన్ కళ్యాణ్ కోసం పనిచేయబోతున్నాను అంటూ అజయ్ మీడియాతో మాట్లాడుతూ తన జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Ajay Arasada)
Ajay Arasada
Ajay Arasada : ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి మ్యూజిక్ అందించి ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఇటీవల పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అభినందించారు ఈ సంగీత దర్శకుడిని. త్వరలోనే పవన్ కళ్యాణ్ కోసం పనిచేయబోతున్నాను అంటూ అజయ్ మీడియాతో మాట్లాడుతూ తన జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అజయ్ అరసాడ తన గురించి చెప్తూ.. మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. వైజాగ్ లో బిటెక్ పూర్తిచేసి టీసీఎస్‌లో ఏడేళ్లు జాబ్ చేశాను. జాబ్ చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. నా భార్య సపోర్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ గూఢచారి సినిమాకు పిలవడంతో కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా మొదలుపెట్టాను. ఓ రెండు సినిమాల తర్వాత సొంతంగా సినిమాలు చేస్తున్నాను. నేను అన్ని రకాల జానర్లు చేస్తాను. నా వద్దకు వచ్చిన కథకు నేను న్యాయం చేయాలని చూస్తాను అని తెలిపారు.
Also See : Shiva Jyothi : కూతురు పుట్టిన తరువాత తొలి భోనం.. ఫోటోలు షేర్ చేసిన శివ జ్యోతి.. సల్లగా ఉండాలే
పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ వెంకట్ చిక్కాల జనసేనలో ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే జనసేనకు కొన్ని సాంగ్స్, వీడియోస్ కి మ్యూజిక్ చేశాను. నా వర్క్ నచ్చి బన్నీ వాస్ గారు నాకు ఆయ్ సినిమా అవకాశం ఇచ్చారు. ఇటీవల మోదీ గారిని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. అది పవన్ గారి దగ్గరకు వెళ్లడంతో నన్ను పిలిపించారు. నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నాను కానీ మళ్లీ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని చెప్పారు. ఓ ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగేసి వస్తానని అనుకున్నా. కానీ నేను వెళ్లేసరికి పర్సనల్ గా మీటింగ్ రూమ్ లో కూర్చొని అయన ఒక్కరే నాతో దాదాపు గంట సేపు మాట్లాడారు. సరదాగా కూడా మాట్లాడారు. నా వర్క్ నచ్చి అభినందించారు. పొలిటికల్‌గా జనసేన కోసం, ఆయన నిర్మాణ సంస్థ పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసం కలిసి పనిచేద్దాం అని ఆయన చెప్పినట్టు తెలిపారు.
Also See : Anna Konidela : బండ్ల గణేష్ కూతురు పెళ్ళిలో సందడి చేసిన పవన్ కళ్యాణ్ భార్య.. అన్నా కొణిదెల ఫొటోలు..
మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు గురించి చెప్తూ.. ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అయితే వాళ్ళతోనే పాడించాలి అనుకుంటాను. కానీ ఇక్కడ దర్శక నిర్మాతలు కొంతమంది ఫేమ్ ఉన్నవాళ్లు కావాలి, తమిళ్, మలయాళం సింగర్స్ కావాలి అని అంటారు. పాట ఫైనల్ చేసేది నేనొక్కడ్నే కాదు. చాలా మంది కలిసి ఆ డెసిషన్ తీసుకుంటారు. మేం థియేటర్‌కి సరిపోయేలా మ్యూజిక్, స్కోర్ ఇస్తాం. కానీ ఓటీటీకి వస్తే ఆ మ్యూజిక్ లెవల్స్ అన్ని మారిపోతాయి. మా మ్యూజిక్ మాకే సంతృప్తి ఇవ్వదు. అప్పటి వరకు మేం పడిన కష్టం వృథా అవుతుంది. నేను చేసిన వికటకవి సిరీస్ ని థియేటర్లో చూస్తే సౌండింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఓటీటీకి వచ్చే సరికి యాభై శాతానికి పడిపోతుంది. కొంత మంది నిర్మాతలు ఇటీవల ఏఐ వాడి అది ఇచ్చిన ట్రాక్స్ పంపి ఇలా కావాలని అంటారు. అలాంటప్పుడు మేం ఎందుకు మీరే కొట్టుకోండి అనిపిస్తుంది. పూర్తిస్థాయిలో ఏఐ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయలేదు. ఒకప్పుడు దర్శకులు సన్నివేశంతో పాటు కాన్సెప్ట్, భావం చెప్పి ట్యూన్ కావాలని అనేవారు. కానీ ఇప్పుడు వస్తున్న చాలా మంది దర్శకులకు అది తెలియడం లేదు. ఎలాంటి పాట కావాలని అడిగితే చెప్పలేకపోతోన్నారు. ఇప్పటి దర్శకులకు మ్యూజిక్ పై అవగాహన లేదు. క్రెడిట్స్ విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆయ్ సినిమాకు నేను మూడు పాటలు, బ్యాక్ గ్రౌండ్ చేశాను. రామ్ మిర్యాల రెండు పాటలు ఇచ్చారు. కానీ ఆయన పేరే వినిపించింది. చాలా చోట్ల నా పేరు కనిపించలేదు. నేను మాత్రం నా టీంలో ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ ఇస్తాను అని తెలిపారు.
