Bheems: అయ్యో.. నేనలా అనలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు.. వైరల్ అవుతున్న భీమ్స్ కామెంట్స్

భీమ్స్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. మాస్ అండ్ క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో భీమ్స్(Bheems) బెస్ట్ అనే చెప్పాలి.

Bheems: అయ్యో.. నేనలా అనలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు.. వైరల్ అవుతున్న భీమ్స్ కామెంట్స్

Music director Bheems responds to trolling

Updated On : November 20, 2025 / 5:05 PM IST

Bheems: భీమ్స్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. మాస్ అండ్ క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో భీమ్స్(Bheems) బెస్ట్ అనే చెప్పాలి. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నువ్వా నేనా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ తరువాత చాలా హిట్ సినిమాలకు వర్క్ చేశాడు కానీ, అనుకున్న బ్రేక్ రాలేదు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో భీమ్స్ లైఫ్ టర్న్ అయ్యింది. ఆ సినిమాలో జింతాక.. జింతాక.. అంటూ సాగే మాస్ సాంగ్ ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ల లిస్టులోకి చేరిపోయాడు బీమ్స్.

Deepika Padukone: డబ్బు కోసం చేశాను అనుకున్నారు.. తప్పులు కూడా చేశాను.. కొన్నేళ్ల తరువాత కూడా..

అయితే, తాజాగా భీమ్స్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా ఈవెంట్ లో భీమ్స్ మాట్లాడుతూ.. రవితేజ లేకుంటే నాకు జీవితం లేదని. చనిపోదాం అనుకునే సమయంలో దేవుడిలా వచ్చిన రవి తేజ తనకు ధమాకా అనే సినిమా ఆఫర్ ఇచ్చాడు. అది ఎప్పటికి మరువలేను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, ఆయన మ్యూజిక్ చేసిన మరో సినిమా 12A రైల్వే కాలనీ. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ ఈవెంట్ లో భీమ్స్ మాట్లాడుతూ.. “నాకు జీవితాన్ని ఇచ్చింది నువ్వా నేనా సినిమా. నన్ను ఎవ్వరు నమ్మని సమయంలో నమ్మి ఆ సినిమా అవకాశం ఇచ్చారు. “వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్ లే” అనే సాంగ్ ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. ఆ అవకాశం ఇచ్చిన నరేష్ కి నేను రుణపడి ఉంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, మొన్న ఈవెంట్ లో రవి తేజ, ఇవాళ ఈవెంట్ లో అల్లరి నరేష్. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాడు. ఇంతకీ ఏది నిజం భీమ్స్ భయ్యా”అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై తాజాగా స్పందించాడు భీమ్స్.. ” నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు మొదట అవకాశం ఇచ్చింది నరేశ్ గారు. ధమాకా సినిమాతో నాకు పునర్జన్మ ఇచ్చింది రవితేజ గారు. ఇదే నేను చెప్పింది. అందులో ఎలాంటి ఉద్దేశం లేదు”అంటూ వివరణ ఇచ్చాడు భీమ్స్.