Manisharma: సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం.. సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు!
టాలీవుడ్‌లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన వార్తతో అందరూ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది.

Music Director Manisharma Mother Saraswathi Passed Away
Manisharma: టాలీవుడ్‌లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన వార్తతో అందరూ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది. మణిశర్మ తల్లి సరస్వతి(88) గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు.
Krishnam Raju Death: కృష్ణంరాజు మృతి తీరనిలోటు.. సినీ ప్రముఖుల సంతాపం!
చెన్నైలో మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న సరస్వతి చికిత్స తీసుకుంటున్నా, ఫలితం లేకుండా పోయింది. ఆమె మరణవార్తతో మణిశర్మ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Manisharma : మణిశర్మ తనయుడి నిశ్చితార్థం ప్రముఖ సింగర్ తో..
ఒకేరోజు ఇండస్ట్రీలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో టాలీవుడ్ ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక మణిశర్మ మాతృవియోగం గురించి తెలుసుకున్న పులువురు సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కాగా సోమవారం నాడు మణిశర్మ తల్లిగారి అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.