సంగీత దర్శకుడు వన్‌రాజ్ భాటియా(93) కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వన్‌రాజ్ భాటియా ఈ రోజు (మే 7) దక్షిణ ముంబైలోని తన నివాసంలో మరణించారు.

Music Director Vanraj Bhatia
Music director Vanraj Bhatia :ప్రముఖ సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వన్‌రాజ్ భాటియా ఈ రోజు (మే 7) దక్షిణ ముంబైలోని తన నివాసంలో మరణించారు. ఆయన వయసు 93 సంవత్సరాలు.. కొంతకాలంగా వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మంథన్, భూమికా, జానే భీ దో యారో !, 36 చౌరింఘీ లేన్, ద్రోహ్ కాల్ , జునూన్ వంటి అనేక చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తామస్, భారత్ ఏక్ ఖోజ్ వంటి ప్రసిద్ధ టెలివిజన్ షోలకు కూడా ఆయన సంగీతం అందించారు.
భాటియాను పాశ్చాత్య శాస్త్రీయ సంగీత స్వరకర్త అని పిలుస్తుంటారు. గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన తమస్ చిత్రానికి సంగీతం సమకూర్చినందుకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2012 లో భాటియాకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. సంగీత ప్రపంచంలో మంచి పేరు సంపాదించిన ఆయన పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. కొద్దిరోజులుగా ఆర్ధిక ఇబ్బందులో ఉన్న ఆయన సడన్ గా అనారోగ్యానికి గురికావడంతో వైద్యానికి ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముకోవాల్సి వచ్చింది.