My South Diva Calendar : 12 మంది హీరోయిన్స్ తో మై సౌత్ దివా క్యాలెండర్..
గతంలో ఈ క్యాలెండర్ ద్వారా పరిచయమైన మోడల్స్ ఇప్పుడు హీరోయిన్స్ గా మారారు.

My South Diva Calendar Launched by Actresses
My South Diva Calendar : కొత్త సంవత్సరం వస్తే జనవరి నెల అంతా కొత్త క్యాలెండర్స్, డైరీల హవా నడుస్తుంది. పలువురు స్పెషల్ గా హీరోయిన్స్, మోడల్స్ ఫోటోలతో క్యాలెండర్లు తయారు చేపిస్తారని తెలిసిందే. తాజాగా మై సౌత్ దివా అనే క్యాలెండర్ ని లాంచ్ చేసారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ ఈ మై సౌత్ దివా క్యాలెండర్‌ని రూపొందించారు.
గతంలో ఈ క్యాలెండర్ ద్వారా పరిచయమైన మోడల్స్ ఇప్పుడు హీరోయిన్స్ గా మారారు. తాజాగా 2025 క్యాలెండర్ ను 12 మంది స్టార్స్ తో గ్రాండ్ గా లాంచ్ చేశారు. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పాలక్ అగర్వాల్ లు ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి హీరోయిన్స్ తో పాటు క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, డైరెక్టర్స్ కరుణ కుమార్, సుజనా రావులు గెస్టులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మై సౌత్ దివా క్యాలెండర్ ఫౌండర్, ఫోటో గ్రాఫర్ మనోజ్ కుమార్ కటొకర్ మాట్లాడుతూ.. మా క్యాలెండర్ తొమ్మిది ఏళ్లుగా వస్తుంది. 12 మంది హీరోయిన్స్ తో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుంది. మా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే కొత్తవారిని మోడల్స్ గా పరిచయం చేశాం. వారిలో కొంతమంది హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది మా క్యాలెండర్ ద్వారా మరో ఐదుగురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని తెలిపారు.
Also Read : SSMB 29 Memes : రాజమౌళి పోస్ట్.. మహేష్ రిప్లై.. మీమ్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఫ్రీ ప్రమోషన్..