Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి మైసూర్ విశ్వ విద్యాలయం డాక్టరేట్

తాజాగా పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ని మైసూర్ విశ్వవిద్యాలయం సత్కరించనుంది. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి మరియు దాతృత్వ కార్యక్రమాలకు గాను ఈ దివంగత నటుడిని మరణానంతరం......

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి మైసూర్ విశ్వ విద్యాలయం డాక్టరేట్

Puneeth

Updated On : March 14, 2022 / 9:27 AM IST

 

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ సినీ పరిశ్రమకే కాక కన్నడ ప్రజలని కూడా శోక సంద్రంలో ముంచేసింది. ఆయన మరణించి నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన్ని మరువకుండా నివాళులు అర్పిస్తున్నారు కన్నడ ప్రజలు. నేటికీ దేశం నలుమూలల నుంచి పునీత్ అభిమానులు, సెలబ్రిటీలు పునీత్ సమాధిని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

Radhakrishna : ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ పై రాధేశ్యామ్ డైరెక్టర్ ప్రశంశలు.. నీపై సినిమా తీస్తారంటూ..

ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ మార్చ్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. పునీత్ చివరి సినిమా కోసం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ని మైసూర్ విశ్వవిద్యాలయం సత్కరించనుంది. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి మరియు దాతృత్వ కార్యక్రమాలకు గాను ఈ దివంగత నటుడిని మరణానంతరం డాక్టరేట్‌తో సత్కరిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ హేమంత్ రావు ప్రకటించారు. మార్చి 22న జరగనున్న యూనివర్శిటీ 102వ స్నాతకోత్సవం సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ఆయన తరపున అవార్డును అందుకోవడానికి అంగీకరించారని తెలిపారు.