ఎంజాయ్ : లెటెస్ట్ చై – సామ్ ఫొటోలు చూశారా..

హైదరాబాద్ : అగ్ర కథానాయిక సమంత, కథానాయకుడు నాగచైతన్య నెదర్లాండ్స్‌లో విహరిస్తున్నారు. ఇది ది బెస్ట్ ట్రిప్ అని, చాలా ఎంజాయ్ చేశామని సమంత సోషల్‌మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టానని అన్నారు. దీంతోపాటు చైతన్యతో కలిసి దిగిన ఫొటోలను, స్నేహితులతో పగలబడి నవ్వుతున్న ఫొటోను షేర్ చేశారు. నువ్వు నవ్వే విధానం అంటూ చైతన్య నవ్వుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో చైతన్య, సమంత ఇద్దరూ కొత్త లుక్‌లో కనిపించారు. తమ తర్వాతి సినిమాల కోసం వీరు ఇలా తయారైనట్లు తెలుస్తోంది.
యూటర్న్‌తో ఇటీవల మంచి హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం మజిలీ సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పెళ్లి తర్వాత చై-సామ్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మరోపక్క సామ్ దర్శకురాలు నందిని రెడ్డి తీస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది. సామ్ తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన సూపర్ డీలక్స్ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.