Naga Chaitanya : మూడు సీజన్ల సిరీస్.. క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారుగా..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య-టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కలిసి చేస్తున్న వెబ్ సిరీస్‌ టైటిల్ ఏంటో తెలుసా?..

Naga Chaitanya : మూడు సీజన్ల సిరీస్.. క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారుగా..

Dootha

Updated On : January 29, 2022 / 5:08 PM IST

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రీసెంట్‌గా తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి.. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో చేసిన ‘బంగార్రాజు’ తో సాలిడ్ హిట్ కొట్టాడు . ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్న చై ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యు’ సినిమా చేస్తున్నాడు.

Senior Hero’s: రిటైర్మెంట్ టైమ్‌లో రికార్డ్స్ సృష్టిస్తున్న సీనియర్ స్టార్స్!

దీని తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కి ‘దూత’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. మూడు సీజన్లగా ఈ సిరీస్ రూపొందనుందని, చైతు డిఫరెంట్ మేకోవర్‌లో కనిపిస్తాడని అంటున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Naga Chaitanya : నాగ చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

చై, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ షూట్ కంప్లీట్ అయింది. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ‘థ్యాంక్ యు’ సమ్మర్ రిలీజ్ అంటున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో చెయ్యాల్సిన సినిమా కూడా త్వరలో స్టార్ట్ కానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌లో ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది.

Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..