Naga Chaitanya : సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పై స్పందించిన నాగ చైతన్య..
తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య సమంత ఫ్యామిలీ మ్యాన్(Family Man) సిరీస్ పై స్పందించాడు.

Naga Chaitanya Comments on Samantha Family Man Series in Dhootha Series promotions
Naga Chaitanya : నాగ చైతన్య తన మొదటి వెబ్ సిరీస్ ‘దూత’తో(Dhootha) రాబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నాగ చైతన్య మొదటి సారి సిరీస్ చేయడం, అది కూడా థ్రిల్లర్ సిరీస్ కావడంతో సిరీస్ పై ఆసక్తి నెలకొంది. ఇక దూత ట్రైలర్ రిలీజ్ అయ్యాక సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నాడు.
తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య సమంత ఫ్యామిలీ మ్యాన్(Family Man) సిరీస్ పై స్పందించాడు. సమంత(Samantha) ఆ సిరీస్ లో బోల్డ్ గా నటించినందుకు వీళ్ళు విడాకులు తీసుకున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. గతంలో కూడా చైతూ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. విడాకుల తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడలేదు. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూలలో ఆ సందర్భం వచ్చిన అచైతూ సమంత గురించి పాజిటివ్ గానే మాట్లాడాడు.
Also Read : Pooja Gandhi : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. లేటు వయసులో ఘాటు ప్రేమ
తాజాగా బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు మీకు నచ్చిన సిరీస్ ఏంటి అని అడగగా.. ఫ్యామిలీ మ్యాన్ అని సమాధానం ఇచ్చాడు చైతన్య. ఆ సిరీస్ నా మనసుని కదిలించింది. నాకు బాగా నచ్చింది. నేను ఆశ్చర్యపోయాను ఆ సిరీస్ చూసి అని చెప్పాడు. అయితే అందులో రెండు సీజన్స్ ఉన్నాయి వాటిల్లో ఏది నచ్చింది అని అడగ్గా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 బాగా నచ్చింది అని చెప్పాడు చైతూ. సీజన్ 2లో సమంత నటించిన సంగతి తెలిసిందే. దీంతో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పై చైతూకి బాగా ఇష్టమైన సిరీస్ అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.