Rangabali : ఓటీటీలోకి వచ్చేసిన నాగశౌర్య రంగబలి.. ఎందులోనో తెలుసా?
ఇప్పుడు రంగబలి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా రిలీజ్ అయి ఆల్మోస్ట్ నెల రోజులు దగ్గరపడుతుండటంతో రంగబలి సినిమా ఓటీటీ బాట పట్టింది.

Naga Shaurya Rangabali Movie Streaming in Netflix OTT
Rangabali Movie : నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘రంగబలి’. కామెడీ, లవ్, మాస్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. రంగబలి సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ గా నిలిచింది. కామెడీతో ప్రేక్షకులని మెప్పించిన సెకండ్ హాఫ్ కొంచెం సాగతీతగా ఉండటంతో సినిమా పర్వాలేదనిపించింది. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అవ్వలేదు.
Kokapet Aunty : ఎకరం వందకోట్లు.. కోకాపేట ఆంటీ అప్పుడే చెప్పింది..
ఇప్పుడు రంగబలి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా రిలీజ్ అయి ఆల్మోస్ట్ నెల రోజులు దగ్గరపడుతుండటంతో రంగబలి సినిమా ఓటీటీ బాట పట్టింది. రంగబలి సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో నేడు ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు.
Rangabali center lo raccha jaragabothundhi. August 4th dhaaka wait cheyyandi. #Rangabali is coming to Netflix soon. #RangabaliOnNetflix pic.twitter.com/3j02x3NmFl
— Netflix India South (@Netflix_INSouth) July 28, 2023