Lakshya Movie : నాగ శౌర్య 20వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌ మూవీగా రాబోతోన్న 20వ చిత్రం ‘లక్ష్య’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Lakshya Movie : నాగ శౌర్య 20వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Lakshya

Updated On : November 24, 2021 / 5:56 PM IST

Lakshya Movie: యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌ మూవీగా రాబోతోన్న 20వ చిత్రం ‘లక్ష్య’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ స్పోర్ట్స్ డ్రామాతో ధర్మేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘వరుడు కావలెను’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాగ శౌర్య నుంచి వస్తున్న మరో డిఫరెంట్ ఫిలిం ‘లక్ష్య’..

Bholaa Shankar : చిరు సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్..

విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య లుక్, హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా పెంచేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది.

Tamannaah Bhatia : అరిటాకులో భోజనం.. దేవతలా మారిన తమన్నా..

ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రంలో ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు.

Lakshya : అన్నీ తానయ్యి.. అందిస్తూ ఆ చేయి..

సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Varudu Kaavalenu : రివ్యూ