Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో కేజిఎఫ్ లాంటి సినిమా తీస్తున్నాం.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్..

గౌతమ్ తిన్ననూరి - విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అభిమానులకు.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో కేజిఎఫ్ లాంటి సినిమా తీస్తున్నాం.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్..

Naga Vamsi Comments on Vijay Devarakonda VD 12 Movie

Updated On : October 14, 2024 / 10:05 AM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం VD12 షూటింగ్ జరుగుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా భారీ సినిమాగా VD12ని తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్లు శ్రీలంకలో షూటింగ్ జరుపుకోగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది.

గౌతమ్ తిన్ననూరి – విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అభిమానులకు. తాజాగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు.

Also Read : Chalaki Chanti – Jabardasth : ఇకపై జబర్దస్త్ చేయను.. చలాకి చంటి సంచలన నిర్ణయం.. ఎందుకంటే..?

నాగవంశీ మాట్లాడుతూ.. గౌతమ్ తిన్ననూరి కేజిఎఫ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో విజయ్ దేవరకొండతో అతను చేసే సినిమా అలా ఉంటుంది. గౌతమ్ స్టైల్ లో విజయ్ దేవరకొండతో కేజిఎఫ్ లాంటి సినిమా చేస్తున్నాము. సైలెంట్ గా సినిమా అంతా పూర్తిచేసాకే ప్రమోషన్స్ మొదలుపెడతాము అని తెలిపారు. దీంతో విజయ్ తో ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇక VD12 నుంచి ఇప్పటిబివరకు ఒకే ఒక పోస్టర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వచ్చే సంవత్సరం మార్చ్ 28న ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసారు.