Naga Vamsi : ‘అజ్ఞాతవాసి’ సినిమా లాస్ నుంచి ‘అరవింద సమేత’ వల్ల కోలుకున్నాం.. ఎన్టీఆర్ పిలిచి హిట్ ఇచ్చారు..

తాజగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడారు.

Naga Vamsi : ‘అజ్ఞాతవాసి’ సినిమా లాస్ నుంచి ‘అరవింద సమేత’ వల్ల కోలుకున్నాం.. ఎన్టీఆర్ పిలిచి హిట్ ఇచ్చారు..

Naga Vamsi spoke about Agnathavasi Movie Flop and how Aravinda Sametha veera Raghava Recover it

Producer Naga Vamsi :  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్ లో త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో వచ్చిన పవన్ 25వ సినిమా ‘అజ్ఞాతవాసి'(Agnathavasi). ఈ సినిమా భారీ పరాజయం పాలైంది. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించారు. ఈ సంస్థ నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ మొదలుపెట్టి నాగవంశీ నిర్మాతగా ప్రస్తుతం దూసుకుపోతున్నారు.

నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తమ సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేస్తున్నారు. తాజగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడారు.

నాగవంశీ మాట్లాడుతూ.. నా సినీ లైఫ్ లో ఛాలెంజింగ్ మూమెంట్ అంటే అజ్ఞాత వాసి. అరవిందసమేత సినిమా(Aravinda Sametha Veera Raghava) ద్వారా దాని నుంచి బయట పడ్డాం. ఆజ్ఞాతవాసి అయ్యాక రెండు నెలలు చాలా డల్ అయిపోయాము. ఆ ఫ్లాప్ నుంచి బయటకి రాలేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు పిలిచి ఇంకెన్ని రోజులు, ఈ షూట్ మొదలుపెట్టి ఈ సంవత్సరమే రిలీజ్ చేసి హిట్ కొడదాం అని అన్నారు. చెప్పినట్టే అజ్ఞాతవాసి జనవరిలో రిలీజయితే అరవింద సమేత అదే సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ చేసి హిట్ కొట్టాము అని తెలిపారు.

Also Read : Ram Charan : ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్ చరణ్.. అయ్యప్పమాలలో..

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 2018 దసరా కానుకగా ఈ సినిమా రిలీజయింది.