Nagababu : నాగబాబుకి ఉన్న ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా? చిరు, పవన్ దగ్గర కూడా అప్పు చేశాడంట.. ఎంతంటే..?
ఎన్నికల కమిషన్ కు నాగబాబు సమర్పించిన తన అఫిడవిట్ అప్పులు, ఆస్తుల వివరాలు అన్ని ప్రకటించారు.

Nagababu Gives Detail assets and liabilities in affidavit submitted to the Election Commission
Nagababu : మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో తమ్ముడు పవన్ కి తోడుగా ఉండి ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసి జనసేన విజయంలో కీలక భాగం అయ్యారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఇటీవలే నాగబాబును అధికారికంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీగా గెలుపు కూడా లాంఛనమే.
ఎన్నికల కమిషన్ కు నాగబాబు సమర్పించిన తన అఫిడవిట్ అప్పులు, ఆస్తుల వివరాలు అన్ని ప్రకటించారు.
నాగబాబు స్థిర, చరాస్తుల వివరాలు..
నాగబాబు 55.37 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ లో పెట్టుబడులు పెట్టారు.
ఆయన వద్ద 21.81 కోట్ల క్యాష్ ఉంది.
23.53 లక్షలు బ్యాంక్ డిపాజిట్ లో ఉన్నాయి.
1.03 కోట్లు వేరేవాళ్లకు రుణాలు ఇచ్చారు.
నాగబాబు వద్ద 67.28 లక్షల విలువైన బెంజ్ కార్ ఉంది.
11.04 లక్షల విలువైన హ్యుందాయ్ కార్ ఉంది.
18.10 లక్షల విలువైన 226 గ్రాముల గోల్డ్ ఉంది.
నాగబాబు భార్య వద్ద 57.90 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం ఉంది.
21.40 విలువైన 20 కేజీల వెండి, 16.50 లక్షల విలువ చేసే 55 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలో వివిధ లొకేషన్స్ లో నాగబాబుకు 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాలు ల్యాండ్ ఉంది.
నర్సాపూర్ వద్ద 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాల ల్యాండ్ ఉంది.
అక్కడే 50 లక్షలు విలువ చేసే మరో 5 ఎకరాల ల్యాండ్ ఉంది.
టేకులపల్లిలో 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల ల్యాండ్ ఉంది.
మణికొండలో 2.88 కోట్ల విలువైన 460 స్క్వేర్ ఫూట్ విల్లా ఉంది.
నాగబాబు అప్పుల వివరాలు..
నాగబాబుకి 56.97 లక్షల హోసింగ్ లోన్ ఉంది.
7.54 లక్షల కార్ లోన్ ఉంది.
1.64 కోట్లు పలువురి దగ్గర అప్పుగా తీసుకున్నారు.
అందులో చిరంజీవి వద్ద 28.48 లక్షల అప్పు చేసారు.
పవన్ కళ్యాణ్ వద్ద కూడా 6.9 లక్షల అప్పు చేసారు.
నాగబాబు చిరంజీవి వద్ద అంటే ఓకే గాని, పవన్ కళ్యాణ్ వద్ద కూడా అప్పు చేశాడా అని ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో పవన్ కూడా తన అన్న చిరంజీవి వద్ద నుంచి 2 కోట్ల అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.