Roja Skit : రీ ఎంట్రీలో రోజా స్కిట్ చూశారా? శ్రీకాంత్ – రాశి మధ్యలో రోజా.. నువ్వు అసెంబ్లీకి వెళ్ళిపో అంటూ శ్రీకాంత్ ఫన్నీ కౌంటర్లు..
రోజా రీ ఎంట్రీ ఇస్తూ శ్రీకాంత్ - రాశిలతో కలిసి చేసిన కామెడీ స్కిట్ మీరు కూడా చూసేయండి..

Roja Re Entry in TV Show Comedy Skit with Srikanth and Raasi Video goes Viral
Roja Skit : నటి, మాజీ మంత్రి రోజా గతంలో రాజకీయాల్లో బిజీ అవ్వడం, మంత్రి పదవి రావడంతో సినిమాలకి, జబర్దస్త్, టీవీ షోలకు బ్రేక్ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇటీవలే రోజా ఓ టీవీ షోతో రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 ప్రోగ్రాంలో ఓ ఎపిసోడ్ లో రోజా రీ ఎంట్రీ ఇవ్వగా దానికి సంబంధించిన ప్రోమోలు కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యాయి.
ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోవడంతో ఈ ఎపిసోడ్ లో సరదాగా రోజా – శ్రీకాంత్ – రాశిలతో కలిసి చేసిన స్కిట్ విడిగా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇటీవల వచ్చిన సూపర్ హిట్ సినిమా సంక్రాతికి వస్తున్నాంకి స్పూఫ్ స్కిట్ వేశారు.
ఇందులో శ్రీకాంత్ వెంకటేష్, రాశి ఐశ్వర్య, రోజా మీనాక్షి పాత్రల్లో సరదాగా కనిపించారు. స్కిట్ లో నువ్వు రమ్మంటే రాలేదు ఎందుకు అని రోజా అడిగితే.. అసెంబ్లీకా అని శ్రీకాంత్ అన్నారు. నువ్వు మళ్ళీ అసెంబ్లీ వెళ్ళిపో అంటూ చివర్లో సరదాగా ఫన్నీ కౌంటర్లు వేశారు శ్రీకాంత్. దీంతో ఈ స్కిట్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. రోజా గతంలో జబర్దస్త్ లో జడ్జిగా చేస్తున్నప్పుడే పలు స్కిట్స్ లో నటించింది. వేరే స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కూడా రోజా గతంలో స్కిట్స్ చేసింది.
రోజా రీ ఎంట్రీ ఇస్తూ శ్రీకాంత్ – రాశిలతో కలిసి చేసిన కామెడీ స్కిట్ మీరు కూడా చూసేయండి..