Nagababu : అల్లుడికి పండుగ గిఫ్టు ఇచ్చిన నాగబాబు
మెగాబ్రదర్ నాగబాబు తన అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశారు. ఆయన ముద్దుల కూతురు నిహారిక గతేడాది డిసెంబర్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.

Nagababu Surprise Gift To Son In Law
Nagababu gives surprises gift to son-in-law Chaitanya : మెగాబ్రదర్ నాగబాబు తన అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశారు. ఆయన ముద్దుల కూతురు నిహారిక గతేడాది డిసెంబర్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లోవీరి విహాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహానికి మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హాజరైంది. ప్రస్తుతం నిహారిక వైవాహిక జీవితాన్ని సంతోంగా గడుపుతూ తన ఫ్యామిలీకి చెందిన అప్ డేట్స్ ను ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో నాగబాబు తన అల్లుడికి ఉగాది కానుకగా రేంజ్ రోవర్ డిస్కవర్ తెలుపు రంగు కారును బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నా అల్లుడికి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు.

Mega Brother Naga Babu
ఈ మేరకు కూతురు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీని ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుదని అంచనా. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుక అని.. కానీ కాస్త ఆలస్యం అయ్యిందని నాగబాబు తన యూట్యూబ్ చానల్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.