Nagababu – Pawan Kalyan : నా అప్పులు తీర్చడానికే ‘గబ్బర్ సింగ్’ చేసాడు.. రెమ్యునరేషన్ విషయంలో బండ్ల గణేష్‌తో పవన్ ఒప్పందం ఇదే..
గతంలో పలుమార్లు ఆరెంజ్ సినిమా వల్ల అప్పులు అయితే పవన్ కళ్యాణ్ తన అప్పులు తీర్చాడని నాగబాబు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

Nagababu Interesting Comments on Pawan Kalyan and Gabbar Singh Movie
Nagababu – Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు థియేటర్స్ లో గబ్బర్ సింగ్ సినిమాతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు గబ్బర్ సింగ్ సమయంలో జరిగిన పలు సంఘటనల గురించి ఒక వీడియో చేసి తన N మీడియా ఎంటర్టైన్మెంట్ లో షేర్ చేసారు.
ఈ వీడియోలో నాగబాబు ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. గబ్బర్ సింగ్ ముందు నాగబాబు ఆరెంజ్ సినిమా చేసి అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గతంలో పలుమార్లు ఆరెంజ్ సినిమా వల్ల అప్పులు అయితే పవన్ కళ్యాణ్ తన అప్పులు తీర్చాడని నాగబాబు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
నాగబాబు మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ బ్రదర్ దగ్గర దబాంగ్ రైట్స్ తీసుకున్నాము. ప్రాఫిట్స్ లో అన్నయ్య అప్పులు తీర్చేసి ఆ తర్వాత నాకేమన్నా వస్తే రెమ్యునరేషన్ ఇవ్వు లేకపోతే లేదు అని పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. దానికి గణేష్ ఓకే అన్నాడు. సినిమా బాగా వచ్చింది. అయితే పవన్ మళ్ళీ రిలీజ్ కి ముందు సినిమా చూసి గణేష్ కి ఇచ్చిన ప్రపోజల్ మార్చేశాడు. సినిమా హిట్ అవుతుంది, నీ ప్రాఫిట్స్ నువ్వు తీసుకో, నీకు ఇవ్వాలనిపించిన రెమ్యునరేషన్ నాకు ఇవ్వు. దాంతో మా అన్నయ్య అప్పులు నేను తీర్చుకుంటాను. నువ్వేమి మా అన్నయ్య అప్పులు తీర్చిద్దు అని చెప్పాడు. గణేష్ దానికి కూడా సరే అన్నాడు. ఆ సినిమాకు లాభాలు చాలానే వచ్చాయి. పవన్ తన రెమ్యునరేషన్ తో నా అప్పులు మొత్తం తీర్చేసాడు. నా అప్పులు తీర్చడానికే పవన్ గబ్బర్ సింగ్ సినిమా చేసాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ కూడా ఫైనాన్షియల్ గా కష్టాల్లోనే ఉన్నాడు. అయినా నా కోసం నిలబడ్డాడు అని తమ్ముడి గురించి గొప్పగా చెప్పాడు. దీంతో మరోసారి పవన్ ని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
అన్నయ్య కష్టపడుతున్నాడు ఇబ్బందులో ఉన్నాడు అని నాకోసం గబ్బర్ సింగ్ మూవి చేసాడు Almost Remuneration నాకే ఇచ్చాడు నువ్ వేరు అయ్యా నీకు అభిమానులు ఉండరు భక్తులే ఉంటారు ఈ కట్టేకాలేవరకు ని అభిమానినే.. 🙏🙏🙏
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య @PawanKalyan❤️❤️#HappyBirthdayPawanKalyan pic.twitter.com/jkoLrDG4rU
— కొమరం పులి (@SingleMan122) September 1, 2024