Samantha : సమంత వ్యాధిపై నాగబాబు రియాక్షన్.. ఈ జనరేషన్‌లో గ్రేటెస్ట్ యాక్టర్ సమంత..

తాజాగా మెగా బ్రదర్ సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ తనకి ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ ని సమంతకి ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ లెటర్ లో.. ''సమంతతో నేనెప్పుడూ డైరెక్ట్ గా మాట్లాడలేదు. కానీ సమంత ............

Samantha : సమంత వ్యాధిపై నాగబాబు రియాక్షన్.. ఈ జనరేషన్‌లో గ్రేటెస్ట్ యాక్టర్ సమంత..

Nagababu Reaction on Samantha Health

Updated On : October 31, 2022 / 12:54 PM IST

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్టు, త్వరలోనే కోలుకుంటాను అని, అందుకే ఇన్ని రోజులు యాక్టీవ్ గా లేనని పోస్ట్ చేసింది సమంత. దీంతో సమంత అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు తను త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు.

Zaid Khan : పవన్ కళ్యాణ్ గారు టైం ఇచ్చారు.. నాకే కుదరలేదు.. ఆయన్ని కలిసి క్షమాపణలు చెప్తాను..

తాజాగా మెగా బ్రదర్ సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ తనకి ఓ లెటర్ రాశారు. ఆ లెటర్ ని సమంతకి ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ లెటర్ లో.. ”సమంతతో నేనెప్పుడూ డైరెక్ట్ గా మాట్లాడలేదు. కానీ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది తెలిసి నా మనసు బాధపడింది. తను త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ధృడంగా తిరిగి రావాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. సమంత చాలా శక్తివంతమైన, స్వతంత్ర మహిళ. ఈ జనరేషన్ లో తను ఒక గొప్ప నటి. తన నుంచి ఇంకా సినిమాలు రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. తన అభిమానుల ప్రేమే తనని త్వరగా కోలుకునేలా చేస్తుంది” అని పోస్ట్ చేశారు. దీంతో ఈ లేఖ వైరల్ గా మారింది.