Zaid Khan : పవన్ కళ్యాణ్ గారు టైం ఇచ్చారు.. నాకే కుదరలేదు.. ఆయన్ని కలిసి క్షమాపణలు చెప్తాను..

జాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు. జైద్ ఖాన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. మా సినిమా తెలుగు ట్రైలర్ ని............

Zaid Khan : పవన్ కళ్యాణ్ గారు టైం ఇచ్చారు.. నాకే కుదరలేదు.. ఆయన్ని కలిసి క్షమాపణలు చెప్తాను..

Zaid Khan comments on Pawan Kalyan

Updated On : October 31, 2022 / 11:23 AM IST

Zaid Khan :  కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ పాన్ ఇండియా సినిమా ‘బనారస్‌’ తో ఎంట్రీ ఇస్తున్నాడు. మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తూ దేశమంతటా ప్రమోషన్స్ చేస్తున్నారు. ‘నాంది’ సినిమా నిర్మాత సతీష్ వర్మ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది.

Balakrishna : అల్లు శిరీష్‌ని నా అన్‌స్టాపబుల్ షోకి పిలిచి.. సీక్రెట్స్ అన్ని లాగుతాను.. ఫ్లాప్ సినిమాలు ప్రేక్షకుల మీద రుద్దొద్దు..

హీరో జైద్ ఖాన్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు. జైద్ ఖాన్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. మా సినిమా తెలుగు ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ గారే విడుదల చేయాలి. ఆయన మాకు టైం ఇచ్చారు. కానీ నాకే కుదరలేదు. ఆ టైంకి నేను అందుబాటులో లేను. దానికి చాలా బాధపడ్డాను. మరోసారి ఆయన్ని కలిసి క్షమాపణలు చెప్పాలి. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాను” అని తెలిపాడు.