Nagarjuna Allari Naresh Naa Saami Ranga movie Trailer released
Naa Saami Ranga Trailer : ఈ సంక్రాంతికి నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తుండగా, హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు.
కాగా ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పోరింజు మరియం జోస్’కి రీమేక్ గా తెరకెక్కుతుందని తెలిసిందే. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా కథ సాగుతుంది. అయితే ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మేకర్స్ సిద్దంచేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ రీమేక్ లో రాజ్ తరుణ్ పాత్రని కొత్తగా జత చేశారు. కథ కూడా ఈ పాత్ర చుట్టూనే నడిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఆ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.
Also read : 12th ఫెయిల్ సినిమా రియల్ స్టోరీ ఎవరిదో తెలుసా?
చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక గత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీకి హిట్స్ రాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సినిమాతో నాగ్ సూపర్ హిట్ అందుకొని ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి నాగ్ ఈ మూవీతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.