Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేస్తుంది.. ప్రోమో రిలీజ్.. ఈ సారి కూడా కింగ్ హయాంలోనే..

తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో విడుదల చేసారు.

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేస్తుంది.. ప్రోమో రిలీజ్.. ఈ సారి కూడా కింగ్ హయాంలోనే..

Nagarjuna Bigg Boss Season 9 Promo Released

Updated On : June 27, 2025 / 7:07 AM IST

Bigg Boss 9 : తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 9 వ సీజన్ కు సిద్ధంగా ఉంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమోలో కింగ్ నాగార్జునే కనిపించారు. ఇటీవల హోస్ట్ ని మారుస్తామని రూమర్స్ వచ్చినా మళ్ళీ నాగార్జుననే తీసుకున్నారు.

ఇక ఈ ప్రోమోలో నాగార్జున.. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అని చెప్తూ స్టైలిష్ గా కనిపించారు నాగ్. మరి ఈసారి బిగ్ బాస్ లో ఎవరెవరు ఆడతారో చూడాలి.

Also Read : Prabhas : ఆయన బయోపిక్ లో ‘ప్రభాస్’.. మరాఠా దర్శకుడితో.. ఏఎన్నార్ తీసిన సినిమా మళ్ళీ తీస్తారా?

మీరు కూడా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో చూసేయండి..