వైల్డ్ డాగ్ షూటింగ్ కంప్లీట్, నెక్స్ట్ సినిమాకు ప్లాన్

Nagarjuna completes shooting for Wild Dog : టాలీవుడ్ మన్మదుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత సీనియర్లలో అందరికన్నా ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన నాగార్జున అప్పుడే షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. అంతేకాదు ..నెక్ట్స్ సినిమా షూటింగ్ కి ప్లాన్లు రెడీ చేస్తున్నారు.
ఎప్పటి కప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తో ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడంలో ముందు ఉంటున్నారు నాగార్జున. 60 ఏళ్లొచ్చినా ఇంకా టాలీవుడ్ మన్మధుడు అని పిలిపించుకుంటున్న సీనియర్ హీరో నాగార్జున .. లాస్ట్ ఇయర్ మన్మధుడు 2 సినిమాలో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ఇక ఎన్నాళ్లు రొమాన్స్ చేస్తామనుకున్నారో ఏమో.. ఈ సారి ట్రెండ్ మార్చి యాక్షన్ హీరోగా మారారు. యాక్షన్ లోకి దిగాక యమా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి జూనియర్లకే సవాల్ విసురుతున్నారు.
ప్రజెంట్ తెరకెక్కుతున్న వైల్డ్ డాగ్ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ గా చేస్తున్న నాగార్జున… లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతేకాదు .. అంతేఫాస్ట్ గా వైల్డ్ డాగ్ కి సంబందించి తన పోర్షన్ కంప్లీట్ కూడా చేసేశారు. మొన్నీ మద్యనే హిమాలయాల్లో తన టీమ్ తోషూటింగ్ ఫోటోలో పెట్టిన నాగార్జున..లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించి నా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది.. ఇంటకొచ్చేస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
https://10tv.in/king-nagarjuna-with-his-team-shooting-for-wild-dog-in-the-himalayas/
యాక్షన్ ధ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ వైల్డ్ డాగ్ షూటింగ్ ఫినిష్ చేశారు కాబట్టి.. దీని తర్వాత చెయ్యాల్సి నెక్ట్స్ ప్రాజెక్ట్ ని లైన్లో పెట్టేశారు. బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ డైరెక్టర్ గా రణబీర్ కపూర్, ఆలియా, అమితాబ్, నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ కోసం ముంబై వెళ్లబోతున్నారు. ఈ షూటింగ్ తర్వాత గరుడ వేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో సినిమాతో పాటు బంగార్రాజు సీక్వెల్ కూడా చెయ్యబోతున్నారు నాగార్జున. ఇలా ఒక వైపు స్మాల్ స్క్రీన్ షూటింగ్స్ తో మరో వైపు వరుస పెట్టి సినిమాలతో కెరీర్ లో ఫుల్ స్పీడుమీదున్నారు నాగార్జున.
Heading home after wrapping up my work for #WildDog !!feeling sad as I say good bye to my talented team and the Himalayas!! #manali @MatineeEnt @SaiyamiKher @ActorAliReza @onelifeitiz @mayankparakh19 @bilal06858696 pic.twitter.com/Ur3V5OH9if
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 6, 2020