Naa Saami Ranga : సంక్రాంతి హీరోలంతా అయిపోయారు.. మిగిలింది నాగార్జునే.. ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ఇదిగో..

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మూడు సినిమాలు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా అందరి చూపు కింగ్ నాగార్జున మీదే పడింది.

Nagarjuna Naa Saami Ranga Movie Pre Release Event Full Details Here

Naa Saami Ranga : ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో సంక్రాంతి(Sankranthi) సినిమాల హంగామా నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ పండగ, సినిమాల పండగ కావడంతో సంక్రాంతి సినిమాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నాయి. ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. జనవరి 12న మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’ సినిమాలతో రాబోతున్నారు. జనవరి 13న వెంకటేష్ ‘సైంధవ్‌’ సినిమాతో రాబోతున్నాడు. ఇక చివర్లో జనవరి 14న నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నారు.

నాలుగు సినిమాలు ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నాయి. హనుమాన్, సైంధవ్‌ సినిమాలు అయితే అన్నిటికంటే ఎక్కువగా ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ పెట్టి హడావిడి చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా సాంగ్స్, ట్రైలర్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అన్ని ప్రమోషన్స్ కి కావాల్సినంత హైప్ ఇచ్చేసారు.

గుంటూరు కారం సినిమా నిన్న గుంటూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. మహేష్ బాబుతో సహా ఆ చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. .

హనుమాన్ సినిమా జనవరి 7నే హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా కూడా వచ్చారు.

వెంకటేష్ సైంధవ్‌ సినిమా కూడా జనవరి 7నే వైజాగ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిచింది. ఈ ఈవెంట్ కి వెంకటేష్ తో సహా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.

Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ‘మావా ఎంతైనా..’ విన్నారా?

ఇలా సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మూడు సినిమాలు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా అందరి చూపు కింగ్ నాగార్జున మీదే పడింది. నాగార్జున నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 10న ఉండబోతుందని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్. నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జనవరి 10 సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో 6 గంటల నుంచి జరగనుంది. దీంతో అక్కినేని అభిమానులు భారీగా తరలి రానున్నారు. ఈ ఈవెంట్ కూడా అయిపోతే సంక్రాంతి బరిలోకి సినిమాలు దిగనున్నాయి. మరి ఈ సంక్రాంతికి నిలిచే పందెం కోడి ఎవరో చూడాలి.