Nagarjuna : నాగార్జున ఇప్పటికి మన్మథుడిగా ఉండటానికి కారణం ఇదే అంట.. సీక్రెట్ చెప్పేసిన కింగ్..
నాగార్జున అందానికి, బాడీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటి? ఆయన ఏం తింటారు? ఏం చేస్తారు అని చాలా మందికి డౌట్.

Nagarjuna Shares her Fitness and Food Secret in Naa Saami Ranga Promotions
Nagarjuna : టాలీవుడ్(Tollywood) లో ఎంత ఏజ్ పెరిగిన ఇంకా యంగ్ గా కనిపించే వాళ్ళల్లో నాగార్జున ఒకరు. ఆల్రెడీ 60 ఏళ్ళు దాటినా నాగార్జున ఇంకా 30 – 40 ఏజ్ ఉన్న వాళ్లలాగే కనిపిస్తాడు. నాగ్ ఈ సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా 30 ఏళ్ళ యువకుడి పాత్రలో ఒదిగిపోయారు నాగార్జున. ఏజ్ ఎంత పెరుగుతున్నా ఇంకా బాడీ ఫిట్ గా ఉంచుకుంటూ, అదే అందం, అదే స్టైల్ మెయింటైన్ చేస్తారు నాగార్జున.
దీంతో నాగార్జున అందానికి, బాడీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటి? ఆయన ఏం తింటారు? ఏం చేస్తారు అని చాలా మందికి డౌట్. ఇటీవల నా సామిరంగ(Naa Saami Ranga) సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున కీరవాణి, చంద్రబోస్ లతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున తన ఫుడ్ గురించి మాట్లాడారు. కీరవాణి.. మీరు ఇప్పటికి ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటి? రాత్రి పూట తినరా? రైస్ తింటారా? అని అడిగారు.
Also Read : Prabhas : ప్రభాస్ పేరు మారింది గమనించారా? జ్యోతిష్యమా? న్యూమరాలజినా?
నాగార్జున వీటికి సమాధానమిస్తూ.. నేను అన్ని తింటాను. కాకపోతే వైట్ రైస్ తినను. బ్రౌన్ రైస్ తింటాను. అందులోకి ఆకు కూరలు, కూరలు అన్ని తింటాను. నాన్ వెజ్ కూడా ఫుల్ గా తింటాను. పచ్చడి కూడా తింటాను. షూటింగ్ లో చేపల పులుసు అక్కడే పట్టి అక్కడే వండితే తిన్నాను. ఫుడ్ పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకొను. అన్ని తింటాను. రాత్రి పూట మాత్రం ఎర్లీగా తింటాను. 7 గంటల లోపే తినేస్తాను. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం స్వీట్ కచ్చితంగా తింటాను. ఓ రెండు రౌండ్స్ వేసుకుంటాను. ఇవన్నీ ఫుల్ గా తిన్నా ఉదయం ఫుల్ గా వర్కౌట్స్ చేస్తాను. 35 ఏళ్లుగా ఇదే రొటీన్. పొద్దున్నే ఎక్కువగా వర్కౌట్స్ చేస్తాను. మనం తిన్నది అంతా ఎనర్జీ కింద మారిపోవడానికి అని అన్నారు.
Roju rendu round lu veystharu anta Nag sir ??
— The Idly Baba (@Idly_Baba) January 14, 2024
దీంతో నాగ్ చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. నాగ్ చెప్పిన దాని బట్టి ఎంత తిన్నా ఫుల్ గా వర్కౌట్స్ చేస్తే బాడీని ఫిట్ గా ఉంచొచ్చు అని తెలుస్తుంది.