Nagarjuna : ఏఎన్నార్ విగ్రహం ముందు కొత్త జంట.. ఇది నా కొడుకు పెళ్లి మాత్రమే కాదు అంటూ నాగ్ స్పెషల్ పోస్ట్..

తాజాగా నాగార్జున స్పెషల్ గా రెండు ఫోటోలు షేర్ చేసి థ్యాంక్స్ అటూ ఓ పోస్ట్ చేసారు.

Nagarjuna Shares Naga Chaitanya Sobhita Wedding Photos with a Special Post

Nagarjuna : నిన్న డిసెంబర్ 4 రాత్రి నాగచైతన్య – శోభిత వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం ఇరుకుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరిగింది. ఇక చైతు – శోభిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Chiranjeevi – Pushpa 2 : ‘బాస్’ని కలిసిన పుష్ప నిర్మాతలు, సుకుమార్.. అల్లు అర్జున్ ఎక్కడ?

అయితే తాజాగా నాగార్జున స్పెషల్ గా రెండు ఫోటోలు షేర్ చేసి థ్యాంక్స్ అటూ ఓ పోస్ట్ చేసారు. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న ఏఎన్నార్ విగ్రహం ముందు వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంటతో పాటు అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఏఎన్నార్ ఆశీస్సులు తీసుకొని ఆయన విగ్రహం ముందు ఫోటోలు దిగారు. ఏఎన్నార్ విగ్రహం ముందు దిగిన అక్కినేని ఫ్యామిలీ, కొత్తజంట ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

నాగార్జున ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ గురించి అందరికి తెలిసేలా చేసిన మీడియాకు ధన్యవాదాలు. మీ బ్లెస్సింగ్స్, మీరిచ్చే గౌరవం మరింత ఆనందాన్ని ఇచ్చింది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ మీ ప్రేమ ఈ మూమెంట్ ని మరింత గుర్తుంచుకునేలా చేసింది. నా కొడుకు పెళ్లి కేవలం ఫ్యామిలీ సెలబ్రేషన్ మాత్రమే కాదు ఒక మంచి జ్ఞాపకం కూడా. అక్కినేని ఫ్యామిలీ మీ బ్లెస్సింగ్స్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తుంది అని పోస్ట్ చేసారు. దీంతో నాగార్జున పోస్ట్ వైరల్ గా మారింది.