Namita Theatre: ఓటీటీ మార్కెట్‌లోకి హీరోయిన్..

Namita Theatre: ఓటీటీ మార్కెట్‌లోకి హీరోయిన్..

Namithas Ott Platform Namitha Theatre

Updated On : May 6, 2021 / 7:26 PM IST

కరోనా కాలంలో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు సంఖ్య తగ్గిపోగా.. ఓటీటీల్లో సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఓటీటీలు నెట్టింట్లో సందడి చేస్తుండగా.. వాటి జాబితాలోకి మరో ఓటీటీ చేరబోతుంది.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. ఇప్పుడు బొద్దుగుమ్మ నమిత ఓటీటీ మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

హీరోయిన్ నమిత తన పేరుతోనే.. ఓటీటీ యాప్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. నమిత థియేటర్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఓటీటీకి నమిత బ్రాండ్ పార్టనర్ కాగా.. రవివర్మ మేనేజింగ్ డైరక్టర్. రవివర్మ అనే అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

నిజ జీవితం సంఘటనలు, కథలు ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు.. షార్ట్ ఫిల్మ్‌లకు ఇందులో ప్రత్యేకంగా ఎంట్రీ ఉంటుంది. ఈ ఓటీటీ ద్వారా చిన్న నిర్మాతలు, కొత్త దర్శకుల్ని ఎక్కువగా ప్రోత్సహించనున్నట్లు ప్రకటించింది నమిత.

ఇప్పటికే ఎన్నో ఓటీటీలు సౌత్‌లో ఉండగా.. ఇప్పుడు ఈ ఓటీటీ ఎటువంటి క్రేజ్ దక్కించుకుంటుందో? చూడాలి.