మా వారిది పెట్టుడు మీసం.. నమ్రత కామెంట్..

Mahesh Babu-Namrata Shirodkar: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కొత్త లుక్స్ ట్రై చేస్తున్నాడు. ‘మహర్షి’ లో గెడ్డంతో రఫ్ లుక్‌లో ఆకట్టుకున్న మహేష్.. ఎప్పుడూ యంగ్ లుక్‌లోనే కనిపిస్తుంటాడు. అయితే తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో సరికొత్త మీసకట్టుతో సాంప్రదాయ పంచెకట్టుతో ఆశ్చర్యపరిచాడు. తాజాగా మహేష్ న్యూ లుక్ గురించి నమత్ర శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారు.
మహేష్ మేకప్ వేసుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘కృత్రిమంగా అమర్చేవి (ఈ సందర్భంలో మీసం) ఎప్పుడూ వాస్తవికంగా కనిపించవు. అలాంటివాటితో షూటింగ్ చేయాల్సి వచ్చినపుడు కచ్చితంగా సౌకర్యవంతంగా లేదా సరదాగా ఉండదు. అయితే తమ వైపు నైపుణ్యంగల నిపుణులు ఉన్నప్పుడు మరలాంటి ఛాలెంజెస్‌ను ఇష్టపడనివారెవరుంటారు’’.. అంటూ కామెంట్ చేశారు నమ్రత.
సినిమాల విషయానికొస్తే మహేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. అమెరికాలో దాదాపు 50 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది.