మహేష్ జిమ్ మామూలుగా లేదుగా!

  • Published By: sekhar ,Published On : July 16, 2020 / 11:21 AM IST
మహేష్ జిమ్ మామూలుగా లేదుగా!

Updated On : July 16, 2020 / 3:53 PM IST

సినీ ప్రముఖులు తమ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. తెరమీద స్లిమ్‌గా కనిపించడానికి సినీ తారలు రోజులో గంటలకొద్ది కసరత్తులకే కేటాయిస్తుంటారు. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు అందం గురించి, ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Mahesh Babu

వయసుతోపాటే మహేష్ అందం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఫిట్‌నెస్ కోసం మహేష్ చాలా శ్రమిస్తాడు. అందుకే నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటాడు సూపర్ స్టార్. ఏజ్ అనేది మహేష్ బాబుకి జస్ట్ నంబర్ మాత్రమే అంటుంటారు సినీ అభిమానులు.
మహేష్ రెగ్యులర్‌గా ట్రైనర్ పర్యవేక్షణలో కఠినమైన వ్యాయామాలు చేస్తాడు. అందుకోసం ఇంట్లోనే విశాలమైన జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

Mahesh Babu

మహేష్ పర్సనల్ జిమ్ విశేషాలను ఆయన భార్య నమత్ర ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ‘ఫీల్ ది థండర్’ అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్ తన 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ చిత్రానికి ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

https://www.instagram.com/p/CCqFsZ2Drcf/?utm_source=ig_web_copy_link