Sarkaru Vaari Paata : భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షో.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన నమ్రత..

మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూసింది. నమ్రతతో పాటు సర్కారు వారి పాట సినిమా టీం...........

Sarkaru Vaari Paata : భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షో.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన నమ్రత..

Namratha

Updated On : May 12, 2022 / 6:07 AM IST

Namratha Shirodkar :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇవాళ (మే 12న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇక తెలంగాణాలో బెనిఫిట్ షోలకి కూడా పర్మిషన్ ఇవ్వడంతో హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో ఇప్పటికే బెనిఫిట్ షోలు పడ్డాయి. మహేష్ అభిమానులు ఆయా థియేటర్ల వద్ద రాత్రి నుంచే హంగామా చేస్తున్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు టీ-సర్కార్ ‘స్పెషల్’ ఆఫర్!

మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూసింది. నమ్రతతో పాటు సర్కారు వారి పాట సినిమా టీం, అనిల్ రావిపూడి కూడా థియేటర్ కి వచ్చారు. నమ్రతని చూసి ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. థియేటర్ వద్ద జై బాబు జై జై బాబు అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. బెనిఫిట్ షోలకి అభిమానులు భారీగా తరలి వచ్చారు.