Balakrishna: మంచు కుటుంబంలో బాలయ్య చెప్పిన మంచి వ్యక్తి ఎవరంటే?

ఆహాలో నంద‌మూరి బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్నారు. ఈ షోకి ఫస్ట్ గెస్ట్‌గా మంచు కుటుంబం వచ్చింది.

Balakrishna: మంచు కుటుంబంలో బాలయ్య చెప్పిన మంచి వ్యక్తి ఎవరంటే?

Manchu Family

Updated On : November 4, 2021 / 9:01 PM IST

Balakrishna: ఆహాలో నంద‌మూరి బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్నారు. ఈ షోకి ఫస్ట్ గెస్ట్‌గా మంచు కుటుంబం వచ్చింది. అనిపించింది అనేద్దాం, అనుకున్న‌ది చేద్దాం, ఎవ‌డు ఆపుతాడో చూద్దాం అంటూ బాల‌య్య ఫస్ట్ టైమ్ ఇరగదీసేశాడు. మంచు కుటుంబంలో బాలకృష్ణకు నచ్చే వ్యక్తి గురించి నిర్మొహమాటంగా ఈ షోలో చెప్పేశాడు బాలయ్య.

మంచు లక్ష్మీ, విష్ణు ముందే మీ అందరిలో మంచి వ్యక్తి మంచు మనోజ్ అంటూ కుండబద్దలు కొట్టేశాడు. బాలయ్యకు మంచు కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్‌ మంచోడు అంటూ చెప్పేశాడు.

ఇదిలా ఉంటే, మోహన్ బాబుని బాలయ్య మరో ప్రశ్న వేశారు. ఇంట్లో పిల్లలు ఆడుకుంటే వచ్చి దండం పెట్టమని వేధిస్తారటగా? అని అడగగా.. అవును వాళ్లకు సంస్కారం నేర్పిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. విష్ణూ ఇద్దరు కూతుళ్ళు వినరు కానీ, మిగిలిన వాళ్ళు వింటారని చెప్పారు మోహన్ బాబు. ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.