Akhanda Mass Jathara : దేవుణ్ణి కరుణించమని అడుగు.. కనిపించమని కాదు.. బాలయ్య ‘మాస్ జాతర’

బాలయ్య నట విశ్వరూపం ‘అఖండ’ మాస్ జాతర.. ట్రెండింగ్‌లో టీజర్..

Akhanda Mass Jathara : దేవుణ్ణి కరుణించమని అడుగు.. కనిపించమని కాదు.. బాలయ్య ‘మాస్ జాతర’

Akhanda Mass Jathara

Updated On : November 28, 2021 / 12:38 PM IST

Akhanda Mass Jathara: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Akhanda Pre Release Event : ‘అఖండ’ సాక్షిగా బన్నీ – బాలయ్య బాండింగ్ అదిరింది..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకోవడమే కాక సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. Akhanda Trailer Roar పేరుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. నటసింహా నందమూరి బాలకృష్ణ సరైన మాస్ క్యారెక్టర్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబితే ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘అఖండ’ ట్రైలర్ రోర్ చిన్న ఎగ్జాంపుల్‌గా నిలిచింది.

Mokshagna : వారసుడొస్తున్నాడు.. బాలయ్య షో లో మోక్షజ్ఞ..

ఇక శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో Akhanda Mass Jathara పేరుతో రిలీజ్ టీజర్ వదిలారు. బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్‌లో రౌద్రంగా కనిపించారు. ఆయన చెప్పిన ఊరమాస్ డైలాగులు ప్రేక్షకాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. డిసెంబర్ 2న ‘అఖండ’ భారీ స్థాయిలో విడుదల కానుంది.