Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

ఈ సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు బాలయ్య..

Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

Nbk Son

Updated On : January 15, 2022 / 2:28 PM IST

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ తెలుగు సంసృతి, సంప్రదాయాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిందే. స్వతాహా లక్ష్మీనరసింహ స్వామి భక్తుడైన బాలయ్యకు దైవభక్తితో పాటు ఆధ్యాత్మికత విషయాల్లో కాస్త పట్టు ఎక్కువే.

Akhanda Title Song : ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది..

ఈ సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు బాలయ్య. ప్రకాశం జిల్లా కారంచేడులోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో గత రెండు రోజులుగా సందడి చేస్తున్నారు బాలయ్య. సతీమణి వసుంధర, తనయుడు మోక్షజ్ఞ, బంధుమిత్రులతో కలిసి ఆయన పండుగను జరుపుకుంటున్నారు.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

భోగి రోజు పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులతో సహా బంధువులంతా స్థానిక ఆలయాన్ని సందర్శించారు. ఇక సంక్రాంతి రోజు బాలయ్య గుర్రమెక్కి సందడి చేశారు. ఆయనతో పాటు తనయుడు మోక్షజ్ఞను కూడా గుర్రమెక్కించారు. బాలయ్యతో ఫ్యామిలీతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Nbk Family