NBK: ఆపద ఎక్కడుంటే బాలయ్య అక్కడ ఉంటాడు..

Nandamuri Balakrishna: ఇటీవల అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు నర్సింహప్ప అనే వ్యక్తి మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న హిందూపురం శాసనసభ్యుడు, నటసింహా నందమూరి బాలకృష్ణ ఆ కుటుంబానికి రూ.1.5లక్షలు ఆర్ధిక సాయం అందించి అండగా నిలిచారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో స్థానిక నాయకులు భాదితుని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందించిన రూ.1.5లక్షల Fixed deposit బాండును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించిన నందమూరి బాలకృష్ణ వారికి మనోధైర్యాన్ని అందించారు.
అలాగే పిల్లలు బాగా చదువుకోవాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. అదే విధంగా స్థానిక TDP నాయకులు ఆ కుటుంబానికి తమ వంతుగా ఆర్ధికసహాయం అందించారు. తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు బాధిత కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి, స్థానిక టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మరో టీడీపీ కార్యకర్త గంగాదరప్పకి వైద్య ఖర్చుల నిమిత్తం 10వేలు ఆర్ధిక సాయం అందించారు బాలయ్య.
ఆపద ఎక్కడుంటే బాలయ్య అక్కడ ఉంటాడు..#NandamuriBalakrishna #HindupurMLA @itsmerevathirc @KavithaPeddi @ pic.twitter.com/AeEZzGIPru
— Y.Chandra Sekhar (@chandra99997) October 1, 2020