‘సారథి’ గా సరికొత్త లుక్‌లో తారకరత్న!

నందమూరి తారకరత్న ‘సారథి’ ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌కి సూపర్ రెస్పాన్స్..
Nandamuri Tarakaratna-Saradhi: నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సారథి’. జాకట రమేష్ దర్శకత్వంలో పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా విజయదశమి సందర్భంగా సారథి ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా.. దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బేనర్ లోగోకి, మా బేనర్‌లో నిర్మిస్తున్న ‘సారథి’ టైటిల్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా నుండి విజయదశమి కానుకగా నందమూరి తారకరత్న ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దసరాకి ఎంతో కాంపిటేషన్ ఉన్నప్పటికి మా ‘సారథి’ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్నేహితులు, సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు.కరోనా సమయంలో కూడా నందమూరి తారక రత్నగారు ఎంతో సాహసంతో షెడ్యూల్‌ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకి మా చిత్ర బృందం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది. గతంలో మా సినిమాకి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి కూడా వాళ్ల దగ్గరనుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని మా ‘సారథి’ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
తారాగణం:
సిద్దేశ్వర రావు, కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకారం, రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ, జబీర్ వెంకట్, ఫరీద్, దేవా, జై, మునీస, మధు, జమాల్.
కెమెరా: మనోహర్ కొల్లి
మ్యూజిక్ డైరెక్టర్: సిద్ధార్థ్ వాటికన్స్
మేకప్: శ్యామ్
స్టంట్స్: కృష్ణ మాస్టర్
డాన్స్ మాస్టర్: హరి జాను, సోము
డిటిఎస్: పద్మారావు,
పిఆర్వో: మధు.వి.ఆర్.
ఎడిటింగ్: సాయి కుమార్ ఆకుల
డిజిటల్ మీడియా: మనోజ్
పోస్టర్స్: నాని
ప్రొడ్యూసర్స్: నరేష్ యాదవ్. పి., వై.ఎస్. కృష్ణమూర్తి, పి. సిద్దేశ్వర రావు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జాకట రమేష్.