Ugly Story : నందు, అవికా గోర్.. ‘హే ప్రియతమా..’ బ్రేకప్ సాంగ్ విన్నారా?

లవ్ బ్రేకప్ అయినా వాళ్లకు ఈ సాంగ్ బాగానే కనెక్ట్ అవుతుంది.

Ugly Story : నందు, అవికా గోర్.. ‘హే ప్రియతమా..’ బ్రేకప్ సాంగ్ విన్నారా?

Nandu Avika Gor Ugly Story Movie Breakup Song Released

Updated On : April 15, 2025 / 8:07 PM IST

Ugly Story : నందు, అవికా గోర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జె.ఎస్.సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మాణంలో ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది ఈ సినిమా.

Also Read : Sumaya Reddy : నిర్మాతగా మారి తనని హీరోయిన్ గా పరిచయం చేసుకుంటున్న తెలుగమ్మాయి..

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ చేయగా తాజాగా ఒక బ్రేకప్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘హే ప్రియతమా..’ అంటూ సాగింది ఈ సాంగ్. ఈ పాటని శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకత్వంలో భాస్కరభట్ల రాయగా కాల భైరవ పాడారు. లవ్ బ్రేకప్ అయినా వాళ్లకు ఈ సాంగ్ బాగానే కనెక్ట్ అవుతుంది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..