Nani 31 : నాని 31 అఫీషియల్ అనౌన్స్.. ఆ దర్శకుడితో మళ్ళీ.. పండక్కి ముహూర్తం..

నానితో ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని మళ్ళీ సినిమా చేయబోతున్నాడు.

Nani 31 : నాని 31 అఫీషియల్ అనౌన్స్.. ఆ దర్శకుడితో మళ్ళీ.. పండక్కి ముహూర్తం..

Nani 31 Movie Announced with Vivek Athreya in DVV Entertainments

Updated On : October 21, 2023 / 11:48 AM IST

Nani 31 Movie : ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు నాని. ఇటీవల యాక్షన్ ఫిలిం దసరా(Dasara) సినిమాతో భారీ హిట్ కొట్టాడు నాని. త్వరలోనే నాని 30వ సినిమా హాయ్ నాన్న అనే క్లాస్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పుడు నాని 31వ సినిమాని ప్రకటించాడు.

నానితో ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని మళ్ళీ సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబోలో సినిమా ఉండబోతుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తుండగా నేడు DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని – వివేక్ ఆత్రేయ(Vivek Athreya) కాంబోలో అధికారికంగా సినిమాని ప్రకటించారు. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ దసరాకి ప్రకటిస్తామని, సినిమా పూజా కార్యక్రమం కూడా అక్టోబర్ 24 దసరా రోజు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Also Read : Devadatta Nage : మహేష్ మేనల్లుడి కోసం రాబోతున్న ఆదిపురుష్ హనుమాన్.. ఈసారి ‘కంసరాజు’గా..

అంటే సుందరానికి సినిమాలో కామెడీ, లవ్ తో మెప్పించిన ఈ కాంబో ఈ సారి యాక్షన్ తో రానున్నారు. ఈసారి ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.