Hit 3 Collections : 100 కోట్లు కొట్టేసిన నాని.. నాలుగు రోజుల్లో హిట్ 3 కలెక్షన్స్ ఎంతో తెలుసా?
మోస్ట్ వైలెంట్ గా తెరకెక్కిన హిట్ 3 సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Nani Hit 3 Movie Four Days Collections
Hit 3 Collections : హీరోగా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న నాని ఇటీవల మే 1న హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా, మోస్ట్ వైలెంట్ గా తెరకెక్కిన హిట్ 3 సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. దానికి తగ్గట్టే మంచి హిట్ అయి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
హిట్ 3 సినిమా మొదటి రోజే 40 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 101 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మూవీ యూనిట్ అధికారికంగా కలెక్షన్స్ అనౌన్న్ చేసారు.
దీంతో ఈ సినిమా ఇప్పటికే అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ అయిపోయిందని తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 90 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంది. 101 కోట్లకు పైగా రావడంతో హిట్ 3 ప్రాఫిట్స్ లో నడుస్తుంది. ఇక అమెరికాలో కూడా హిట్ 3 కలెక్షన్స్ ఆల్రెడీ 2 మిలియన్ డాలర్స్ దాటేసింది. థియేటర్స్ కి జనాలే రావట్లేదని అనుకుంటున్న సమయంలో నాని తన సినిమాతో నాలుగు రోజుల్లోనే 100 కోట్లు సాధించడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ అభినందిస్తున్నారు.
SARKAAR'S CENTURY 💥💥💥
101+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 4 days ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/T7DiAuhyZCA massive first weekend for the action crime thriller 🔥#BoxOfficeKaSarkaar
Natural Star @NameisNani @KolanuSailesh @SrinidhiShetty7… pic.twitter.com/bhl9Ghr4JU— Unanimous Productions (@UnanimousProds) May 5, 2025
Also Read : Alekhya – Kavitha : ఏంటి.. తారకరత్న భార్య, కవిత ఇంత క్లోజ్ ఫ్రెండ్సా? అలేఖ్య పోస్ట్ వైరల్..