‘జెర్సీ’ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ కు టైం ఫిక్స్
వరుస సినిమాలతో విజయం సాధిస్తు ప్రేక్షకులకి థ్రిల్ కలిగించే నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

వరుస సినిమాలతో విజయం సాధిస్తు ప్రేక్షకులకి థ్రిల్ కలిగించే నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
వరుస సినిమాలతో విజయం సాధిస్తు ప్రేక్షకులకి థ్రిల్ కలిగించే నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. జెర్సీ చిత్రం మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషిస్తున్నారు. 36 ఏళ్ల వయసులో అర్జున్ క్రికెట్‌లో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిస్థితులేమిటన్నది ఈ సినిమాలో తెలుస్తుంది. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. హిందీ లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 12న ఉదయం 9 గంటలకు విడుదల చేయగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 15న నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Read Also : ‘మజిలీ’ డైరక్టర్ తో దేవరకొండ