Deepthi Ganta : నన్ను నెపోటిజం అంటున్నారు.. ఎమోషనల్ అయిన నాని సోదరి..
హీరో నాని సోదరి దీప్తి ఇటీవల దర్శకురాలిగా మారి మీట్ క్యూట్ అనే సిరీస్ ని తెరకెక్కించింది. దీనికి నానినే నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మీట్ క్యూట్ సిరీస్ ని సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందనే లభించింది.............

Nani Sister Deepthi Ganta emotional post
Deepthi Ganta : హీరో నాని సోదరి దీప్తి ఇటీవల దర్శకురాలిగా మారి మీట్ క్యూట్ అనే సిరీస్ ని తెరకెక్కించింది. దీనికి నానినే నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మీట్ క్యూట్ సిరీస్ ని సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందనే లభించింది. అయితే ఈమె నాని సోదరి కావడం వల్లే డైరెక్టర్ ఈజీగా అయింది. నాని కూడా నెపోటిజంని సపోర్ట్ చేస్తున్నాడు, నాని లేకపోతే ఈమెకి ఛాన్స్ వచ్చేది కాదు అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. దీంతో వీటిపై దీప్తి సమాధానమిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
మీట్ క్యూట్ సిరీస్ షూటింగ్ టైంలో నాని సెట్ లో ఉన్నప్పటి కొన్ని ఫోటోలని షేర్ చేస్తూ.. చాలా మంది నన్ను నెపోటిజం అని, నాని ఉన్నాడు కాబట్టే నేను దర్శకురాలిని అయ్యానని అంటున్నారు. నేను, నాని చిన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉన్నప్పటి నుంచి మేమిద్దరం లైఫ్ మీద చాలా కలలు కన్నాం. దాని కోసం కష్టపడ్డాం. నేను కథలు రాస్తాను. అలాగే ఈ కథ కూడా రాశాను. నానికి నచ్చి తానే ఎంకరేజ్ చేసి పూర్తి కథ సిద్ధం చేయించాడు నాతో. తానే నిర్మాత అవుతానని చెప్పాడు. నేను అడగలేదు. డైరెక్టర్ గా కూడా మారమని ప్రోత్సహించి సపోర్ట్ చేశాడు. అవును నా నాని వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. ఇందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సిరీస్ బయటకి రావడానికి కూడా కారణం నానినే. మీట్ క్యూట్ కి మంచి స్పందన వచ్చాక నాకంటే నానినే ఎక్కువ సంతోషంగా ఫీల్ అయ్యాడు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Kirrak RP : కొత్తరకం కర్రీ పాయింట్ పెట్టిన జబర్దస్త్ నటుడు..
దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.