The paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. రెండు జడలతో నాని లుక్ అదుర్స్..
నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం ది ప్యారడైజ్.

Nani The Paradise first look release
నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ది ప్యారడైజ్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా ఈ చిత్రంలో నాని పాత్ర పేరును రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇది ఒక అల్లికగా ప్రాంభమై.. విప్లవంగా ముగిసింది అంటూ పేర్కొంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాని రెండు జడలతో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.
His Name/వాడి పేరు
‘Jadal’
‘జడల్’Calling a spade a spade. #THEPARADISE @odela_srikanth @anirudhofficial @SLVCinemasOffl @Dop_Sai @NavinNooli @artkolla @kabilanchelliah pic.twitter.com/gN3i0fPxv7
— Nani (@NameisNani) August 8, 2025
ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీలతో పాటు మొత్తం 8 భాషల్లో రిలీజ్ కానుంది.