The Paradise: ‘ది ప్యారడైజ్’ నుండి క్రేజీ అప్డేట్.. సెకండ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్(The Paradise) సినిమా నుంచి రెండో సాంగ్ విడుదల కానుంది.
Nani the paradise movie second song update
- త్వరలో ‘ది ప్యారడైజ్’ రెండో పాట.
- వాయిదా పడే ఛాన్స్ ఉన్న మూవీ.
- నాని, అనిరుధ్ క్రేజీ పాన్ ఇండియా.
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్(The Paradise)’. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Pooja Hegde: మన ఊరి అమ్మాయిలా మెరిసిపోతున్న పూజ.. క్రేజీ క్యాప్షన్‌తో నెటిజన్ల ఫిదా
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ ఏ రేంజ్ లో చాట్ బ్లాస్టర్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనిరుధ్ అందించిన మాస్ ట్యూన్‌తో సోషల్ మీడియా షేక్ అయ్యింది అనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా నుంచి రెండో సాంగ్ కూడా విడుదల కనున్నట్టుగా సమాచారం. వచ్చే నెల 10న చిత్ర మేకర్స్ రెండో పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే, మొదటి సాంగ్ మాస్ జానర్ కాగా రెండవది మాత్రం ఫీల్ గుడ్ లవ్ సాంగ్ అని, యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కొంత అనిశ్చితి నెలకొంది. తొలుత ఆగస్టు 24న విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, నాని ఈసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనిపిస్తోంది. అనిరుధ్ సంగీతం, నాని నటన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీ సాంగ్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
