Brahmani Nara : మహేష్ వైఫ్ నమ్రత బర్త్‌డే పార్టీలో నారా లోకేష్ భార్య బ్రాహ్మణి.. వైరల్ అవుతున్న ఫొటో..
తన బర్త్ డే నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ ప్లేస్ లో నమ్రత తన బర్త్ డే పార్టీ చేసుకోగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ హాజరయ్యారు.

Nara Lokesh Wife Brahmani Attended to Namrata Shirodkar Birthday Party Photo goes Viral
Brahmani Nara – Namrata Shirodkar : మహేష్ బాబు భార్య, ఒకప్పటి నటి నమ్రత శిరోద్కర్ ఇటీవల జనవరి 22న తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. మహేష్ ప్రస్తుతం జర్మనీలో ఉండగా సోషల్ మీడియాలో నమ్రతకు విషెష్ చెప్తూ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఇక నమ్రత తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
తన బర్త్ డే నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ ప్లేస్ లో నమ్రత తన బర్త్ డే పార్టీ చేసుకోగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ హాజరయ్యారు. నమ్రత బర్త్ డే పార్టీకి మంజుల, మహేష్ ఇంకో అక్క, సుధీర్ బాబు భార్య, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, పలువురు ఫ్యాషన్ డిజైనర్లు.. మరికొంతమంది నమ్రత ఫ్రెండ్స్ వచ్చారు. అయితే ఈ పార్టీకి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా వచ్చింది.
Also Read : Namrata Shirodkar : ఫ్యామిలీ & ఫ్రెండ్స్‌తో నమ్రత శిరోద్కర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
నమ్రత తన బర్త్ డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిల్లో బ్రాహ్మణి కూడా ఉంది. నమ్రత బర్త్ డే పార్టీకి టీడీపీ నేత లోకేష్ భార్య, బాలయ్య కూతురు బ్రాహ్మణి కూడా రావడం, నమ్రతతో క్లోజ్ గా ఫొటోలు దిగడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.