Nara Rohit : నారా రోహిత్ సినిమాలకు ఆరేళ్ళు గ్యాప్ ఎందుకిచ్చారు..? క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్..
నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాతో ఆరేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారో తెలిపారు.

Nara Rohit gives Clarity about his Career Gap in Movies
Nara Rohit : సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీఫెలో.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఒకప్పుడు మెరిశాడు నారా రోహిత్. కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత నారా రోహిత్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. చివరిసారిగా 2018లో వీరభోగ వసంత రాయలు సినిమాలో చివరిసారిగా కనపడ్డారు. అప్పట్నుంచి మళ్ళీ నారా రోహిత్ తెరపై కనపడలేదు.
ఇప్పుడు నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాతో ఆరేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత సుందరకాండ సినిమాని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ప్రతినిధి 2 సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నారా రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారో తెలిపారు.
Also Read : Sivaji : డబ్బుల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన మెగాస్టార్.. ఆ సమయంలో.. ఎంతంటే..?
నారా రోహిత్ మాట్లాడుతూ.. 2017, 2018 ఆ సమయంలో నా సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. నా సినిమాలు నాకే కొన్ని నచ్చలేదు. నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలే నాకు నచ్చలేదు. స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా నాకు నచ్చలేదు అనిపించింది. దీంతో ఓ రెండేళ్లు గ్యాప్ తీసుకుందాము అనుకున్నాను. ఆ తర్వాత కరోనా కూడా రావడంతో ఆ గ్యాప్ ఇంకా పెరిగింది. కానీ ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నాను. వాటిల్లో కొన్ని ఓకే చేసాను. ఇప్పుడు ప్రతినిధి 2తో వస్తున్నాను. ఆ తర్వాత కూడా ఇకపై వరుసగా సినిమాలు వస్తాయి. మళ్ళీ గ్యాప్ తీసుకోను, మంచి కథలతో వస్తాను అని తెలిపారు.