Nari Nari Naduma Murari Trailer: ఇద్దరు భామలతో శర్వా ఫన్ రైడ్.. నారీ నారీ నడుమ మురారి ట్రైలర్ వచ్చేసింది!
శర్వానంద్ హీరోగా వస్తున్న నారీ నారీ నడుమ మురారి ట్రైలర్(Nari Nari Naduma Murari Trailer) విడుదల చేశారు మేకర్స్.
- శర్వా నారీ నారీ నడుమ మురారి ట్రైలర్ విడుదల
- ఇద్దరు భామలతో శర్వా రొమాన్స్
- అంచనాలు పెంచుతున్న ట్రైలర్
Nari Nari Naduma Murari Trailer: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా నారీ నారీ నడుమ మురారి ట్రైలర్(Nari Nari Naduma Murari Trailer) విడుదల చేశారు మేకర్స్. మాజీ లవర్, ప్రజెంట్ లవర్ మధ్య సతమతమయ్యే యువకుడిగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ చాలా ఎంతెర్తైనింగ్ గా ఉంది. ఈ పండక్కి ఫుల్ ఫన్ రైడ్ కన్ఫర్మ్ గా కనిపిస్తోంది. అలాగే ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి.
