Natasha Doshi : నిశ్చితార్థం చేసుకున్న బాలయ్య సినిమా హీరోయిన్..

మాంత్రికన్ అనే మలయాళ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ నటాషా దోషి. అనంతరం పలు మలయాళం సినిమాలు చేసి తెలుగులో బాలయ్య సరసన 'జై సింహ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Natasha Doshi : నిశ్చితార్థం చేసుకున్న బాలయ్య సినిమా హీరోయిన్..

Natasha Doshi engaged with her lover Manan Shah

Updated On : July 16, 2023 / 3:54 PM IST

Natasha Doshi :  మాంత్రికన్ అనే మలయాళ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ నటాషా దోషి. అనంతరం పలు మలయాళం సినిమాలు చేసి తెలుగులో బాలయ్య సరసన ‘జై సింహ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కోతల రాయుడు సినిమా, ఎంత మంచివాడవురా సినిమాలో ఓ సాంగ్ చేసి మెప్పించింది. 2020 నుంచి సినిమాలకు దూరంగా ఉంది నటాషా.

Nandita Swetha : ఆ వ్యాధితో బాధపడుతున్నా.. వ్యాయామాలు చేయలేను.. కానీ ఈ సినిమా కోసం.. హీరోయిన్ ఎమోషనల్..

తాజాగా మానన్ షా అనే ఓ వ్యాపార వేత్తను నిశ్చితార్థం చేసుకుంది నటాషా దోషి. నిశ్చితార్థం ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రేమ ఎప్పటికి గెలుస్తుంది అని పోస్ట్ చేసింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. నటాషా ప్రేమించిన అబ్బాయినే ఇరు కుటుంబాల్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతుంది. ప్రస్తుతం నటాషా నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు వీరికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Natasha Doshi (@natashadoshi)