Nani : న్యాచురల్ స్టార్ నాని.. నెక్స్ట్ సినిమాల లైనప్ అదిరిపోయిందిగా.. ఏకంగా అరడజను సినిమాలు..

తాజాగా టాలీవుడ్ లో నాని సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Nani : న్యాచురల్ స్టార్ నాని.. నెక్స్ట్ సినిమాల లైనప్ అదిరిపోయిందిగా.. ఏకంగా అరడజను సినిమాలు..

Natural Star Nani Next Movie Lineup goes Viral

Nani Movies : న్యాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సెకండ్ హీరోగా మారి ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్ లు కొట్టి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఒక మాములు హీరో స్థాయి నుంచి 100 కోట్లు కలెక్షన్స్ తెచ్చే స్థాయికి నాని ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవలే ఫిబ్రవరి 24న నాని తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు.

నాని పుట్టిన రోజు నాడు తన సినిమాల అప్డేట్స్ కూడా కొన్ని వచ్చాయి. తాజాగా టాలీవుడ్ లో నాని సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాని మొదటి నుంచి కూడా సినిమా సినిమాకి కథల్లో వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నాడు. ఇటీవల దసరా లాంటి ఫుల్ మాస్ సినిమాతో 100 కోట్ల హిట్ కొట్టి ఆ తర్వాత హాయ్ నాన్నతో ఎమోషనల్ క్లాసిక్ హిట్ కొట్టాడు.

నాని నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో మాస్ కమర్షియల్ గా రాబోతుంది. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఈ సినిమాని DVV ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.

ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమా రజినీకాంత్ భాష స్టయిల్లో ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని కూడా DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించడం విశేషం.

అనంతరం బలగం సినిమా ఫేమ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు నాని. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంకో సినిమా ఉంటుందని గతంలో ప్రకటించాడు.

Also Read : Tanvi Negi : ‘యానిమల్’ కంటే ‘అర్జున్ రెడ్డి’నే బాగా నచ్చింది.. అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అంతకుముందు రాలేదు..

ఈ నాలుగు సినిమాలు అయితే కన్ఫర్మ్ అయి ఉన్నాయి. వీటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని సినిమా ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. అలాగే ఓ తమిళ్ డైరెక్టర్ తో కూడా నాని సినిమా ఉండబోతుందని సమాచారం. ఇలా నాని తన నెక్స్ట్ సినిమాల లైనప్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్స్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు న్యాచురల్ స్టార్.