Navaratri 2023 : నవరాత్రి 9 రోజులు.. 9 మంది హీరోయిన్స్.. 9 ఎమోషన్స్.. వైజయంతి మూవీస్ సరికొత్త ప్రయోగం..

నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తమ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల్లోని 9 బెస్ట్ క్యారెక్టర్స్ లో నటించిన 9 మంది హీరోయిన్స్ ఫోటోలని, వారికి సంబంధించిన 9 ఎమోషన్స్ ని షేర్ చేస్తామని ఇటీవల ప్రకటించింది.

Navaratri 2023 : నవరాత్రి 9 రోజులు.. 9 మంది హీరోయిన్స్.. 9 ఎమోషన్స్.. వైజయంతి మూవీస్ సరికొత్త ప్రయోగం..

Navaratri 2023 Special vyjayanthi Movies shares 9 Heroines Characters with their Emotions

Updated On : October 18, 2023 / 9:06 AM IST

Navaratri 2023 : దేశమంతటా దసరా(Dasara) సంబరాలు జరుపుకుంటున్నారు. 9 రోజులు 9 దేవతామూర్తుల అవతారలతో అమ్మవారిని పూజిస్తారు భక్తులు. ఈ 9 రోజుల దసరా పండగను ఎవరికి వాళ్ళు వాళ్ళ రీతిలో ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తమ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల్లోని 9 బెస్ట్ క్యారెక్టర్స్ లో నటించిన 9 మంది హీరోయిన్స్ ఫోటోలని, వారికి సంబంధించిన 9 ఎమోషన్స్ ని షేర్ చేస్తామని ఇటీవల ప్రకటించింది.

చెప్పినట్టే తమ సినిమాల్లోని హీరోయిన్స్ ఫోటోలు షేర్ చేస్తూ మహిళా శక్తికి ప్రతీకగా ఆ పాత్ర ఎమోషన్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తుంది. ఇప్పటికి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి శ్రీదేవి(ఇంద్రజ క్యారెక్టర్), సీతారామం సినిమా నుంచి మృణాల్ ఠాకూర్(సీత క్యారెక్టర్), ఆజాద్ సినిమా నుంచి సౌందర్య(అంజలి క్యారెక్టర్స్) గురించి పోస్ట్ చేశారు. మిగిలిన ఈ ఆరు రోజులు కూడా మరో ఆరుగురు హీరోయిన్స్ గురించి చెప్పనున్నారు.

Also Read : Allu Arjun : నేషనల్ అవార్డు వేడుకల్లో అల్లు అర్జున్ సందడి..

ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉందని, తమ నిర్మాణంలో తెరకెక్కిన మహిళా పాత్రల గురించి చక్కగా చెప్తున్నారని పలువురు అభినందిస్తున్నారు.